రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. చివరి దశలో ఉన్న 'సైరా' సినిమా కి దర్శకత్వం సురేందర్ రెడ్డి చేస్తున్నారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 వ తారీఖు నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎవరూ ఊహించని రీతిలో అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్.


ఈ క్రమంలో చిరంజీవి సినిమా కోసం కొత్త అవతారం ఎత్తడానికి రామ్ చరణ్ సిద్ధమైనట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ లో సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్ యాక్టర్స్ తో రామ్ చరణ్ స్వయంగా యాంకర్ గా వారి అభిప్రాయాలను తెలుసుకొనే ఒక్కొక్కరితో స్పెషల్ వీడియోలు చేసి ఆడియో ఫంక్షన్ లో మెగా అభిమానులను అలరించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


ముఖ్యంగా చరణ్ యాంకర్ గా మారితే సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని….కానీ రాజమౌళి సినిమా ‘RRR’ షూటింగ్ విషయంలో చరణ్ ఏ విధంగా రాజమౌళి ని ఒప్పిస్తాడోనని మరికొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వారు అంటున్నారు. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: