ముంబై లో ఉండే బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కి కూకట్పల్లి కి కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా? .. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ లో తాజాగా ఆయనపైన కేసు ఒకటి నమోదు కావటమే.


సంచలనంగా మారిన ఈ కేసు విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.....ఇంతకీ హ్రితిక్ ఎం నేరం ఏమిటో తెలుసా? ఒక ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే. కల్ట్ ఫిట్ నెస్ పేరుతో ఏర్పాటు చేసిన జిమ్ ల మీద మీద తాజాగా ఆరోపణలు రావటం.. ప్రాథమిక సమాచారం ప్రకారం అది నిజమని తేలటంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కూకట్ పల్లి కల్ట్ ఫిట్ నెస్ సెంటర్లో తాను ఫీజు చెల్లించినప్పటికీ తనకు కేటాయించిన స్లాట్ ఇవ్వటం లేదని శశి అనే వ్యక్తి  పోలీసులకు కంప్లైంట్ చేశారు.
దీంతో పోలీసులు కీలకమైన వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. తనకున్న బరువు తగ్గించటమే కాదు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన శిక్షణను అందిస్తారని ఆశతో  అధిక మొత్తం చెల్లించి స్లొట్లు బుక్ చేసుకున్నాడు. అయితే.. మొదట హామీ ఇచ్చినట్లు కాకుండా ప్రస్తుతం రోజుకు 1800 మంది సభ్యులను జిమ్ లో చేరుకునేసరికి.. వారి రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో హామీ ఇచ్చిన ప్రకారం జిమ్ పరికారాలు అందుబాటులో లేకుండా పోవటంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దీంతో.. కల్ట్  యజమానులతో పాటు.. ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన  బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పైనా కేసు నమోదు చేశారు. అయితే.. కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: