బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని ఇంకా వెంటాడుతున్న కృష్ణజింకల వేట కేసు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు సల్మాన్ఖాన్ కోర్టుకు హాజరు కాకపోతే ఇచ్చిన బెయిల్ను రద్దు చేసే అవకాశం ఉందని సల్మాన్ ఖాన్ కి జోధాపూర్ కోర్టు ఇటీవల వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు సమన్లు జారీ చేస్తూ వెంటనే కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.


1998లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’  సినిమా షూటింగ్‌ కోసం జోధ్‌పూర్‌కు వెళ్లిన సల్మాన్ అక్కడ మిగతా నటులతో కలిసి కృష్ణ జింకలని వేటాడాడు. 20 ఏళ్ల విచారణ అనంతరం ఏప్రిల్-5,2018న జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు తుది తీర్పు చెప్పింది. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ ఖాన్‌ కు ఐదేళ్లు జైలు శిక్ష పడగా, మిగతా నిందితులైన సైఫ్‌ అలీ ఖాన్‌, టబు, సోనాలీ బిద్రేలను నిర్దోషులుగా కోర్టు తెలిపింది.


రెండురోజుల పాటు జైళ్లో ఉన్న సల్మాన్ ఖాన్ కు జోథ్ పూర్ కోర్టు ఏప్రిల్-7,2018న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.ప్రస్థుతం సల్మాన్ ఖాన్ దబాంగ్-3ఘూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ కి మళ్లీ కోర్టు సమాన్లు జారీ చేయడంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 

 

 



మరింత సమాచారం తెలుసుకోండి: