రాజమౌళి కీరవాణిల సాన్నిహిత్యం జక్కన్న సినిమాలకు ఎంతగానో సహకరించింది. రాజమౌళి తీసిన అన్ని సినిమాలకు కీరవాణి సంగీతాన్ని అందించడమే కాకుండా ప్రత్యేక శ్రద్ధను తీసుకుని రాజమౌళి సినిమాలకు కీరవాణి అందించిన ట్యూన్స్ జక్కన్నను నేషనల్ సెలెబ్రెటీగా మార్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఇలాంటి పరిస్థుతులలో రాజమౌళి లేటెస్ట్ గా చేసిన ఒక్క ట్విట్ చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో ఉన్నాడు. దీనితో రాజమౌళి ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్న తానా మహాసభల కోసం రాజమౌళి అమెరికా వెళ్ళాడు అంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. 

జరుగుతున్న ఈ ప్రచారం రాజమౌళి దృష్టి వరకు రావడంతో వెంటనే రంగంలోకి దిగి ఒక ట్విట్ చేసాడు. "ఫ్రెండ్స్.. నేను వ్యక్తిగత పనుల నిమిత్తం వాషింగ్టన్ వచ్చాను.  తానా కన్వెన్షన్ కోసం కాదు.  పెద్దన్న కీరవాణి మ్యూజికల్ షోకు కూడా హాజరయ్యే అవకాశం లేదు.  నేను అక్కడికి వస్తానని ఆశించిన వారు నేను రాకపోతే నిరాశపడే అవకాశం ఉంది.  అందుకే నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.  

దీనితో రాజమౌళి క్లారిటీ బాగానే ఉన్నా తానా మహాసభల ప్రస్తావన మధ్య కీరవాణి సంగీత విభావరి గురించి రాజమౌళి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాడు అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. మరికొందరైతే రాజమౌళికి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో బ్రిటీష్ నటి డైసీ షాక్ ఇచ్చిన నేపధ్యంలో హాలీవుడ్ కు సంబంధించి ఎవరైనా హీరోయిన్ ను ఎంపిక చేయడానికి రాజమౌళి అమెరికా వచ్చాడా అంటూ మరి కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. దీనితో రాజమౌళి కీరవాణిలను ‘తానా మహాసభల’ వేదిక పై చూడాలి అని కోరిక ఉన్నవారికి జక్కన్న ఇచ్చిన ట్విస్ట్ షాక్ అనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: