మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న భారీ హిస్టారిక‌ల్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ కంప్లీట్ అవ్వ‌డంతో అప్పుడే బిజినెస్ డీల్స్ స్టార్ట్ అయ్యాయి. గాంధీజ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా గురించి ట్రేడ్స్‌లో ఒక్క‌టే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150 లాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమా వంద కోట్ల షేర్ రాబట్టే సత్తా ఉన్నప్పుడు... మూడు భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా మ‌రింత భారీగా వ‌సూలు చేస్తుంద‌న్న ధీమా స‌హ‌జంగానే నిర్మాత‌కు ఉంటుంది.


ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్‌తోనే చెర్రీ సైరాను టాప్ రేట్ల‌కు అమ్మాల‌ని చూస్తున్నాడ‌ట‌. చెర్రీ న‌టించిన రంగస్థలం 120 కోట్ల దాకా రీచ్ అయ్యింది. కొంత డివైడ్ టాక్ ఉన్నా మహర్షి 102 కోట్ల దాకా వెళ్ళాడు. ఇప్పుడు సైరా అన్ని భాష‌ల్లోనూ క‌లిపి సులువుగానే రూ.200 కోట్ల షేర్ రాబ‌డుతుంద‌న్న‌దే చెర్రీ ధీమా.


ఇక బాహుబ‌లి రేంజ్ టాక్ వ‌స్తే అప్పుడు మ‌రింత‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దున్నేసుకోవ‌చ్చు. ఓవ‌ర్సీస్ మార్కెట్ మీద కూడా చాలా అంచ‌నాలే ఉన్నాయి. అయితే సురేంద‌ర్‌రెడ్డి మీద బ‌య్య‌ర్ల‌కు మ‌రీ అంత న‌మ్మ‌కం అయితే లేదు. అందుకే చెర్రీ చెపుతోన్న రేట్లు చూసి కాస్త వెన‌కా ముందూ ఆలోచిస్తున్నార‌ట‌. ఏదేమైనా సైరాతో మెగాస్టార్ స‌త్తా చాటుతాడా ?  సైరా ఎలాంటి రిజ‌ల్ట్ న‌మోదు చేస్తుంద‌న్న‌దానికోసం మ‌రో మూడు నెల‌లు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: