బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు. ఆయనపై ఎన్నో వివాదాస్పద కేసులు కూడా నమోదు అయ్యాయి. ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసులో ఎన్నో ఇబ్బందులు పడ్డారు సల్మాన్ ఖాన్.  ఇక ఏప్రిల్ 5, 2018 న , రాజస్థాన్లోని జోధ్పూర్ ప్రాంతంలో 1998'హమ్ సాత్ సాత్ హై'  మూవీ  లో అతను కృష్ణ జింక వేటాడటంతో సల్మాన్ ఖాన్ కేసులో 20 సంవత్సరాల విచారణ తర్వాత 5 ఏళ్ళు జైలు శిక్ష విధించారు.

కృష్ణ జింకల వేట కేసులో తదుపరి విచారణకు కోర్టులో హాజరుకాకపోతే బెయిల్ రద్దు చేస్తామంటూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు జోథ్ పూర్ కోర్టు నేడు ఆయనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ ఖాన్‌ కు  ఐదేళ్లు జైలు శిక్ష పడగా, మిగతా నిందితులైన సైఫ్‌ అలీ ఖాన్‌, టబు, సోనాలీ బిద్రేలను నిర్దోషులుగా కోర్టు తెలిపింది.

కాగా,  ఏప్రిల్ లో ఈ కేసుకు సంబంధించిన వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను జూలై 4కు అంటే నేటికి  వాయిదా వేసింది. సల్మాన్ ఖాన్ కచ్చితంగా విచారణకు హాజరుకావాలని ఆయన తరపు న్యాయవాదులకు అప్పట్లో  సూచించింది. కానీ  ఈరోజు విచారణకు సల్మాన్ డుమ్మా కొట్టడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే వారం కోర్టుకు హాజరుకాకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.ప్రస్థుతం సల్మాన్ ఖాన్ దబాంగ్-3ఘూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: