ఈ మద్య ఐస్ బకెట్, కికీ చాలెంజ్..ఇలా ఎన్నో రకాల ఛాలెంజ్ లో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  ఇలాంటి ఛాలెంజ్ ల వల్ల సమాజానికి ఏం మేజేస్ ఇస్తారోకానీ అనర్థాలు మాత్రం చాలా జరిగాయి.  తాజాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' అనేది బాగా వైరల్ అవుతోంది.  హాలీవుడ్ స్టార్ హీరోల ఈ ఛాలెంజ్ మొదలైతే..తెలుగు, తమిళ, హిందీ హీరోలు ఈ ఛాలెంజ్ ని స్వీకరించారు. 

ఇప్పటికే యాక్షన్ హీరో అర్జున్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఛాలెంజ్ స్వీకరించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.  'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' పై యాంకర్ రష్మి ఫైర్ అవుతుంది. బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ని నిజంగానే సీరియస్ గా తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించింది.  అసలు ఇలాంటివి చేసేవాళ్లకు పనీపాటా లేదని చెప్పింది.

అయినా ఇదేమన్నా సమాజానికి మేలు చేసే ఛాలెంజా..ఇలాంటి వాటిపై శ్రద్ధ పెట్టేకంటే పనికొచ్చే విషయాలపై పెడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేవారు సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని. ఇలాంటి వాటిని జనాలు కూడా ప్రోత్సహించకూడదని హితవు పలికింది. ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: