నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ వ్యూస్ పరంగా రికార్డుల మోత మొదలుపెట్టెసింది. ఇప్పటిదాకా సాఫ్ట్ మిల్కీ లవర్ బాయ్ పాత్రల్లోనే ఎక్కువగా చూసిన రామ్ ని ఊర మాస్ బస్తీ అవతారంలో చూసి ఫాన్స్ సైతం షాక్ అవుతున్నారు. అయితే ప్రేక్షకుల నుంచి దీనికి మిశ్రమ స్పందన వస్తోందనే చెప్పాలి. ఇంకొందరు నెగటివ్ గా చెప్పినవాళ్ళు లేకపోలేదు.

 

కథ మరీ ఓవర్ మాస్ గా కనిపిస్తోందని రామ్ బాడీ లాంగ్వేజ్ కి మించి హీరోయిజంను చూపించారని తెలంగాణా స్లాంగ్ ని సరిగా వాడలేదని ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. పూరి అభిమానులు రామ్ ఫ్యాన్స్ మాత్రం దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. చాలా ఏళ్ళ తర్వాత అసలు సిసలైన మాస్ సినిమాను పూరి ఇస్తున్నారని విడుదల కోసం ఎదురుచూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.

 

ఇలా మిక్స్డ్ రెస్పాన్స్ రావడం ఏ సినిమాకైనా కామనే కాని ఇప్పుడు పూరి సమాధానం చెప్పాల్సింది నెగటివ్ గా ఉన్నవాటికే. గత కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు సక్సెస్ లు లేక రేస్ లో వెనుకబడ్డ పూరి దీంతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కసిమీదున్నాడు. కంటెంట్ తో కరెక్ట్ గా కొడితే రికార్డులు గ్యారెంటీ.

 

కాని ఆ నమ్మకాన్ని ట్రైలర్ లో పూర్తి స్థాయిలో కలిగించలేకపోయినా అసలు సినిమాలో ఊహించని ట్రీట్మెంట్ ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఏదైతేనేం ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ వచ్చాక ఎదురైన మిక్స్డ్ రెస్పాన్స్ ని కంటెంట్ తోనే కొట్టాలి మరి. జూలై 18న భారీ ఎత్తున విడుదల చేసేందుకు పూరి టీం ఏర్పాట్లు చేసేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: