గ్లామర్ రంగంలో రాణించాలని చాలా మంది అమ్మాయిలు కలలు కంటారు. తమ అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. సినిమాల్లో, టీవీ రియాలిటీ షోల్లో, యాడ్స్ లో రాణిస్తారు. రియాలిటీషోల్లో తనదైన ముద్ర వేసిన భామ శ్రీముఖి. నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే శ్రీముఖి ఇప్పుడు హాట్.. హాట్ ఫోజులిస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.


శ్రీముఖి తన అందంతో, చాతుర్యంతో రియాలిటీ షోల్లో చక్కని యాంకరింగ్ చేస్తూ రాణిస్తోంది. అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నా అవి తక్కువే. తనకున్న టాలెంట్ ను రియాలిటీ షోలకే పరిమితం చేస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో మోడలింగ్ స్టిల్స్ ఇస్తూ మోడలింగ్ కూడ చేస్తోంది. దాదాపు రెండు రోజులకోసారి కొత్త కొత్త వార్డ్ రోబ్ తో అందమైన డ్రెస్సులతో స్టిల్స్ ఇస్తూ యూత్ ను ఖుషీ చేస్తుంది. ఇప్పటి వరకూ అమ్మడు ఎప్పుడూ హద్దులు దాటకుండా నిండైన దుస్తులతోనే స్టిల్స్ ఇస్తూండేది. ఇప్పటివరకూ చేసింది చాలనుకుందేమో.. ఇప్పుడు పద్దతి మార్చింది. రెడ్ స్కర్ట్ వేసుకుని దిగిన స్టిల్స్ లో కొద్దిగా మసాలా దట్టించి హాట్ హాట్ ఫోజులిస్తోంది. నిండైన దుస్తుల్లోనే అందంగా కనిపించే శ్రీముఖి హాట్ హాట్ దుస్తుల్లో మరింత మెరిసిపోతోంది. తన ట్విట్టర్ అకౌంట్ ఆ ఫోటోలు హల చల్ చేస్తున్నాయిప్పుడు.

 

దీంతో ఈ అమ్మడు స్టిల్స్ ను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. మొన్నామధ్య నడుమందాలు చూపిస్తూ స్టిల్స్ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు మోకాలి పైకి పొట్టి స్కర్ట్స్ వేసుకుని గుబులు రేపుతోంది. త్వరలో బిగ్ బాస్ 3 సీజన్ లో కూడా పాల్గొనబోతోంది. ఇందుకే తన స్టిల్స్ లో హాట్ డోస్ పెంచినట్టుంది. అందమైన భామలు పసందమైన స్టిల్స్ ఇస్తే ఆ జిల్ వేరు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: