యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి డైరక్టర్ గా సర్ ప్రైజ్ ఇచ్చాడు ఓంకార్. జీనియస్ సినిమాతో డైరక్టర్ గా మారిన ఓంకార్ రాజు గారి గది సినిమాతో హిట్ అందుకున్నాడు. పివిపి నిర్మాణంలో అతి తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డైరక్టర్ గా ఓంకార్ మొదటి సక్సెస్ అందుకున్న ఓంకార్ ఆ తర్వాత రాజు గారి గది 2 సినిమా చేశాడు.


అయితే మళయాళ సినిమా రీమేక్ గా వచ్చిన రాజు గారి గది 2 సినిమాలో నాగార్జున, సమంత వంటి స్టార్స్ నటించినా సరే ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ రాజు గారి గది 3 సినిమా చేస్తున్నాడు ఓంకార్. దర్శక నిర్మాతగా ఓంకార్ చేస్తున్న రాజు గారి గది 3 ఈమధ్యనే మొదలైంది. 


తమన్నా హీరోయిన్ గా ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా నుండి ఇప్పుడు తమన్నా బయటకు వచ్చి కాజల్ ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తుంది. తాప్సీ పేరు ప్రచారంలో ఉన్నా చిత్రయూనిట్ మాత్రం కాజల్ కు ఓటేస్తున్నారట. అయితే రాజు గారి గది 3 మాత్రమే కాదు రాజు గారి గది 4,5 ఇలా కంటిన్యూ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడట ఓంకార్.


ఓంకార్ బుర్రలో చాలా గదులు ఉన్నాయట. అయితే ఒకసారి చేసిన హీరోయిన్ ను కాకుండా ప్రతి గదిలో మరో హీరోయిన్ ను తీసుకుంటాడని తెలుస్తుంది. రాజు గారి గది 3 కాజల్ దాదాపు కన్ఫాం  అయినట్టే. మరి ఈ సినిమా అయినా ఓంకార్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. రాజు గారి గది 2 పెద్దగా వర్క్ అవుట్ కాకున్నా ఓంకార్ ఈసారి తన సొంత కథతో రాజు గారి గది 3 సినిమా చేస్తున్నాడు.   
  


మరింత సమాచారం తెలుసుకోండి: