జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘రాక్షసి’. గౌతంరాజ్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో జ్యోతిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా నటించారు. ఆ పాఠశాలను ఎలా ఉన్నతస్థాయికి తీసుకొచ్చారన్నదే చిత్ర కథ.

 

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ జ్యోతికను దృష్టిలో పెట్టుకునే ఈ కథను రాసుకున్నా. ఈ సినిమాలో మరొకరిని ఏమాత్రం ఊహించుకోలేను. అందుకు తగ్గట్టుగా జ్యోతిక కూడా చాలా వర్కవుట్‌ చేశారు. పలువురు ఉపాధ్యాయుల వద్ద ఆమె మాట్లాడి.. వారి వ్యవహారశైలి, యాస, బాడీలాంగ్వేజ్‌ను తెలుసుకున్నారు.

 

కొన్ని సన్నివేశాల్లో మేం అనుకున్నదానికన్నా అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ చిత్రం ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జ్యోతిక పోషించిన ‘గీతారాణి’ అనే పాత్ర అందరి హృదయాల్లో నిలిచిపోతుందని’’ తెలిపారు.

 

సినిమా గురించి జ్యోతిక మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నాకన్నా ఎక్కువ శ్రమించిన వ్యక్తి సినిమాటోగ్రాఫర్‌ గోకుల్‌. నన్ను సన్నగా చూపించేందుకు ఆయన చాలా శ్రమపడ్డారు. ఈ సినిమాపై నాకు ఎక్కువ నమ్మకం ఉందని’’ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: