దేవినేని నెహ్రూ జీవిత కథ ఆధారంగా శివనాగు రూపొందిస్తున్న చిత్రం దేవినేని. బెజవాడ సింహం ఉపశీర్షిక. తారకరత్న ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి కనిపించనున్నారు. ఆర్‌టిఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో వుంది.

 

కాగా బుధవారం వంగవీటి రంగా జయంతి సందర్భంగా సురేష్ కొండేటి లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా ప్రస్థానం ఎంత గొప్పదో దేవినేని నెహ్రూ ప్రస్థానం అంతే గొప్పది. రంగా, నెహ్రూల స్నేహం శతృత్వంగా మారడానికి గల కారణాలు ఎన్నో వున్నాయి.

 

అయితే అవన్నీ చరిత్రలో నిక్షిప్తమై ఉన్న గొప్ప నగ్న సత్యాలు. ఆ నగ్న సత్యాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమే దేవినేని. ఇద్దరు మహానాయకుల యదార్థ గాధను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నమే ఈ సినిమా అన్నారు. నిర్మాత మాట్లాడుతూ దేవినేని, రంగా పాత్రలు పోటాపోటీగా వుంటాయి.

 

రంగా పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఆయనకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశాం. సహజత్వానికి దగ్గరగా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అన్నారు. ఇంకా ఈ సినిమా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందని కూడా పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: