పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న క్రేజీ మూవీ ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూరి సినిమాల్లో హీరోయిన్స్ రెచ్చిపోవడం కామనే. తన సినిమాలకు వచ్చే ఫ్యాన్స్ ను అన్నివిధాలుగా శాటిస్ఫై చేస్తాడు పూరి.     


అందుకే ఈ సినిమాలో హీరోయిన్స్ ఇద్దరిని తెగ వాడేసినట్టు కనిపిస్తుంది. ట్రైలర్ లో రామ్ అటు నిధి అగర్వాల్ తో ఇటు నభా నటేష్ తో ఇద్దరితో రొమాన్స్ అదరగొట్టేశాడని అనిపిస్తుంది. ట్రైలర్ లోనే ఇలా రెచ్చిపోతే ఇక సినిమాలో ఇంకెలా అదరగొట్టారో అని సిని ప్రియులు అంచనాలతో ఉన్నారు. అయితే ఈ సినిమాలో నిధి గర్వాల్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.   


నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో నటించిన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలో చేసింది. ఆ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. అందుకే ఇస్మార్ట్ శంకర్ లో రెచ్చిపోయి మరి గ్లామర్ షో చేసింది. రాం కూడా తన కెరియర్ లో ఎప్పుడు చేయని ఊర మాస్ క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. 


సినిమా ట్రైలర్ చూస్తే సినిమాకు పక్కా U/A ఫిక్స్ అంటున్నారు. కొందరు కేవలం A వచ్చినా రావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం కాలంలో స్టార్ సినిమాలకు A సర్టిఫికెట్ చాలా కామన్ అయ్యింది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని పూరి ఇస్మార్ట్ శంకర్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి పూరి రామ్ క్రేజీ కాంబో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.      



మరింత సమాచారం తెలుసుకోండి: