విమర్శలు,పొగడ్తలు ఈ రెండు ఎక్కువగా వినబడే రంగం సినిమా రంగం,సినీతారలకు అవన్నీ సహజమే కానీ కొంతమంది తారలు ఇంకాస్త ముందుకెళ్లి విమర్శలనే కాదు వివాదాలను,విచారణలను కూడా మూట కట్టుకుంటారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పరిశ్రమ బాలీవుడ్ పరిశ్రమ.

"హమ్ సాత్ సాత్ హై" చిత్ర నిర్మాణ సమయంలో కృష్ణ జింకలని వేటాడడు అనే కేస్ ఇప్పటికి సల్మాన్ ఖాన్ మీద ఉంది,అయితే సల్మాన్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు, కోర్ట్ కి సరిగా హాజరు కాకపోయే సరికి జోధ్ పూర్ కోర్ట్ సల్మాన్ కి షాక్ ఇచ్చింది, కోర్ట్ కి హాజరు అవ్వకపోతే బెయిల్  ను రద్దు చేస్తామని జోధ్ పూర్ కోర్ట్ సమన్లు పంపింది.
గత ఏడాది జోధ్ పూర్ కోర్ట్ కృష్ణ జింకలని వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు 5సంవత్సరాల శిక్ష విధించింది. రెండు రోజులు జైలు లో గడిపిన సల్మాన్ ఖాన్ బెయిల్ పైన బయటి కొచ్చాడు.

20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు ఇంత వరకు న్యాయం జరగలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు,కృష్ణ జింకలు కేస్ లో సల్మాన్ ఖాన్ ను 11 సంవత్సరాలుగా విచారిస్తున్నారు.సల్మాన్ రీసెంట్ గా నటించిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: