నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్‌కు ఎట్ట‌కేల‌కు ఈ యేడాది 118 సినిమాతో మంచి హిట్ వ‌చ్చింది. ప‌టాస్ త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్‌కు ఈ సినిమాయే కాస్త ఊర‌ట ఇచ్చింది. క‌ళ్యాణ్ కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్యే ( మంచి లక్షణాలున్న అబ్బాయ్ ) టైటిల్‌తో యావ‌రేజ్ మార్కులు వేయించుకున్నాడు. మ‌ధ్య‌లో నానువ్వే లాంటి టైటిల్స్‌తో వ‌చ్చాడు. త్వ‌ర‌లో రావ‌ణ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.


ఇదిలా ఉంటే ఈ క్ర‌మంలోనే మ‌రో మంచి టైటిల్ క‌ళ్యాణ్ ప‌ట్టేసిన‌ట్టు తెలుస్తోంది. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం వంటి ఫీల్ గుడ్ టైటిళ్లతో సినిమాలు అందించిన దర్శకుడు సతీష్ వేగ్నిశ డైరక్షన్లో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్‌పై శుక్ర‌వారం క్లారిటీ రానుంది.


ముందుగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం  'ఎంత మంచి వాడవురా' అన్నది టైటిల్ అనే టైటిల్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా స్క్రిఫ్ట్‌ను ద‌ర్శ‌కుడు స‌తీష్ రాసిన‌ట్టు టాక్‌. ఈ సినిమాలో మెహరీన్ కథానాయిక. గోపీసుందర్ సంగీతం. ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మిస్తోంది. మ‌రి క‌ళ్యాణ్ ఎంత మంచివాడు అనిపించుకుని హిట్ ఇస్తాడో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: