ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతోన్న రెండు సినిమాలు దేశ‌వ్యాప్తంగానే క్రేజ్ తెచ్చుకున్నాయి. మెగాస్టార్ కెరీర్‌లో 151వ సినిమాగా తెర‌కెక్కే ఖైదీ నెంబ‌ర్ 150, యంగ్‌రెబ‌ల్ స్టార్ సాహో సినిమాలు రెండూ భారీ బ‌డ్జెట్‌తో మ‌ల్టీ లాంగ్వేజెస్‌లో వ‌స్తున్న‌వే. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఎలా మారిపోయిందో మ‌నం చూశాం. ఇప్పుడు ఆ మార్కెట్ కంటిన్యూ చేసే క్ర‌మంలోనే ప్ర‌భాస్ ఏకంగా రూ.300 కోట్లతో సాహో సినిమా చేస్తున్నాడు.

ఇటు లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిరు ఖైదీ నెంబ‌ర్ 150తో హిట్ కొట్టి ఇప్పుడు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న సైరా సినిమాలో న‌టిస్తున్నాడు. వీటిలో సాహో ఆగ‌స్టు 15న‌, సైరా అక్టోబ‌ర్ 2న వ‌స్తున్నాయి. రెండు సినిమాల‌కు జ‌రుగుతోన్న బిజినెస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 

సాహో వ‌ర్సెస్ సైరాతో పోలిస్తే సాహోకే ఎక్కువ క్రేజ్ క‌న‌ప‌డుతోంది. త‌మిళ్‌, హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకే మంచి బ‌జ్ ఉంది. హైఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో పాటు బాహుబ‌లి త‌ర్వాత నేష‌నల్ ఇమేజ్ తెచ్చుకుని ప్రభాస్ న‌టిస్తోన్న సినిమా కావ‌డం సాహోకు ప్ల‌స్‌. ఇక చిరు సైరాపై తెలుగులోనే ఎక్కువ బ‌జ్ ఉంది.

 ప్రి రిలీజ్ బిజినెస్‌లో కూడా సాహోకే ఎక్కువ బ‌జ్ ఉన్నా... సైరా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ్డాక ఆ సినిమా బ‌జ్ కూడా పెర‌గ‌వ‌చ్చు. ఏదేమైనా ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ క‌లెక్ష‌న్లు రాబ‌డుతుందో ?  ఎవ‌రి స‌త్తా ఎంతో ?  చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: