మెగాస్టార్  చిరంజీవి తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు  కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే.  కాగా   మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ సహకారంతో ఈ చిత్రాన్ని రామ్ చరణ్  కొణిదెల ప్రొడక్షన్ లో  నిర్మించనున్నారు. తాజాగా  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్  అక్టోబర్ నుండి ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మెగాస్టార్ ఆగష్టు వరకూ సైరా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైనే దృష్టి పెట్టనున్నారు.  


కాగా కొరటాల మూవీ నవంబర్ లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   ఇక డైలాగ్ రైటర్ గా  కెరీర్ ను మొదలుపెట్టి  స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో  కొరటాల శివ ఒకరు.  మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న  స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది. చిరు కోసం  కొరటాల  ఓ  సోషల్ మెసేజ్ తో కూడుకున్న  స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట.  ఇక ఈ సినిమాను  వచ్చే ఏడాది  ఏప్రిల్ రెండవ వారంలో ఉగాది పండుగ సందర్భంగా  విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: