ఈనాటి రాజకీయాలు ఎంతగానో కలుషితం అయిపోయాయని విప్లవ నటుడు ఆర్ నారాయాణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి రాజకీయ పరిస్థితులు చూస్తే బాధ, కోపం వస్తున్నాయని ఆయన అన్నారు. రాజకీయాలకు అర్ధం మార్చేస్తున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.


మార్కెట్లో ప్రజాస్వామ్యం మూవీ వివరాలను చెప్పేందుకు విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనాటి ప్రజాస్వామ్యం మార్కెట్లో ఉందని, ఎవరైనా దర్జాగా కోట్లు పెట్టి కొనుక్కోండని నాయకులు ఆఫర్ చేస్తున్నరని అన్నారు. గెలిచిన పార్టీల్లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ చేస్తూ ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తున్నారని అన్నారు.


ఇక కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్ కొనుక్కుని ఎమ్మెల్యే ఎంపీ అవుతున్నారని, క్యాడర్ కి మాత్రం ఎప్పటికీ లీడర్ అయ్యే చాన్సే లేదని అన్నారు.  ఈ నేపధ్యంలో తాను ఈ సినిమా తీశానని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా దేశంలో ఫిరాయింపులపై నిర్భయంగా మాట్లాడి, అవి వద్దు అంటూ డోర్లు క్లోజ్ చేసిన వైఎస్ జగన్ గ్రేట్ అన్నారు


 ఆయన మంచి నాయకుడు అని కితాబు ఇచ్చారు. జగన్ మాదిరిగా మిగిలినా వారు కూడా ఆలోచన చేయాలని, ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: