భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు ఆ సినిమాలకు సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ దగ్గర నుండి ప్రతి ప్రమోషన్ యాక్టివిటీస్ లో యంకార్ సుమ పాత్ర లేకుండా ఉండదు. ఇప్పుడు సుమకు రామ్ చరణ్ చెక్ పెట్టబోతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా’ ప్రమోషన్ కోసం చరణ్ యాంకర్ అవతారం ఎత్తబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ విడుదలయ్యే  అక్టోబర్ 2 దగ్గర పడుతున్న నేపధ్యంలో ఒక ప్లాన్ ప్రకారం హైప్ వచ్చేలా ఈమూవీ ప్రమోషన్ కార్యక్రమాలను చరణ్ చాల ముందుగానే ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

అందులో భాగంగా చరణ్ యాంకరింగ్ అవతారం అని అంటున్నారు.  ఈసినిమాలో నటించిన  స్టార్ క్యాస్ట్ ఒక్కొక్కరిని విడివిడిగా ఇంటర్వ్యూలు చేసే బాధ్యత చెర్రీ తీసుకుంటాడట. దీని వల్ల ఆఇంటర్వ్యూలకు మంచి రేటింగ్స్ కూడ వస్తాయని చరణ్ అభిప్రాయం అని అంటున్నారు. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లోచరణ్ బిజీగా ఉన్నప్పటికీ తన డేట్స్ ను సద్దుబాటు చేసుకుని ఇలా యాకర్ అవతారం ఎత్తడానికి ఇప్పటికే రాజమౌళి అనుమతులు తీసుకున్నట్లు టాక్.

ఇందులో భాగంగా అమితాబ్ బచ్చన్ తో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విజయ్ సేతుపతి సుదీప్ జగపతి బాబు లాంటి టాప్ స్టార్స్ తో ఇంటర్వ్యూలు చేసే విధంగా ఇప్పటికే చరణ్ తన డేట్స్ ను లాక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఇంటర్వ్యూల వీడియో ఫుటేజ్ ని ‘సైరా’ విడుదలకు ముందు అన్ని ఛానల్స్ కు రొటేట్ చేస్తూ ఏ ఛానల్స్ లో చూసినా ‘సైరా’ హంగామాతో పాటు చరణ్ యాంకరింగ్ హడావిడి కూడ కనిపించబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: