రాయ్ లక్ష్మీ అనగానే గుర్తుకొచ్చేది ఆమె చెసిన గ్లామర్ పాత్రలే. గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరు రాయ్ లక్ష్మీ.  " కాంచనమాల కేబుల్ టీవీ" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన  ఈ అమ్మడుకి పేరు తీసుకొచ్చింది గ్లామర్ పాత్రలే.  ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంపైనే అవుతున్నా నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఒక్కటి కూడా రాలేవనే చెప్పాలి. అయితే తాజాగా ప్రస్తుతం నటిస్తున్న ఒక పాత్ర ఆమె గ్లామర్ ఇమేజ్ ని మార్చేస్తుందని నమ్మకంగా ఉందట.

 

తమిళంలో నీయా-2 (నాగకన్య), తెలుగులో వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి చిత్రాల తర్వాత ఇప్పుడామె సిండ్రెల్లా అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి వినో వెంకటేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా దెయ్యం కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని, అయితే రెగ్యులర్‌ దెయ్యపు చిత్రాలకు భిన్నంగా చాలా స్పీడ్‌ చిత్రంగా దీనిని మలుస్తున్నారట.

 

ఇందులో ఆమె పోషించిన పాత్ర కొత్త ఇమేద్‌ను తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఇదిలావుండగా…హిందీలో ఆమె నటించిన జూలీ-2, తమిళంలో నీయా-2, తెలుగులో వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశపరిచాయి. దాంతో మంచి విజయం కోసం ఆమె ఎదురుచూస్తోంది.

 

తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయబోతున్న సిండ్రెల్లా చిత్రమైనా తనకు కెరీర్‌ పరంగా మేలు చేకూరుస్తుందని, తన నటనను మరో కోణంలో చూసే అవకాశాన్ని కల్పిస్తుందని ఆమె నమ్మకంతో ఉంది. తప్పకుండా ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ చిత్రం అందిస్తుందన్న అభిప్రాయాన్ని చిత్ర వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. మరి ఈ పాత్ర అయినా ఆమెను గ్లామర్ చట్రం నుండి బయటపడేస్తుందని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: