‘ఆర్ ఆర్ ఆర్’ లో చరణ్ జూనియర్ లు కలిసి నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీలో ఎవరికీ ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది విషయమై చరణ్ జూనియర్ అభిమానుల మధ్య కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే రాజమౌళి మాత్రం ఒక మీడియా మీట్ లో స్పందిస్తూ తన సినిమాలో కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజ్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి కాని చరణ్ జూనియర్ లలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న విషయం తాను పట్టించుకొను అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 

ఇది ఇలా ఉండగా ఒకప్పటి క్రేజీ హీరోయిన్ సమీరా రెడ్డి ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్స్ కామెంట్స్ కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. జూనియర్ తో తాను నటించిన సినిమాలు కేవలం రెండే అయినప్పటికీ జూనియర్ మనస్తత్వం తనకు తెలుసు అనీ ఎదుటి హీరో తనను డామినేట్ చేస్తాడని భయంతో ఉండడని అంటూ తారక్ తో నటించే నటీనటులు అంతా చాల ఆనందంగా ఉండాలని చూసుకుంటూ ఎటువంటి ఇగోలను జూనియర్ ప్రవర్తనలో కనిపించదు అంటూ సమీరా రెడ్డి కామెంట్స్ చేసింది. 

తాను జూనియర్ తో ‘నరసింహుడు’ ‘అశోక్’ సినిమాలలో నటించినా తమ ఇద్దరి మధ్య చాల స్నేహం ఏర్పడింది అన్న విషయాలను గుర్తుకు చేసుకుంటూ తమ స్నేహాన్ని చూసినవారు తప్పుగా అర్ధం చేసుకుని తమ మధ్య ఎఫైర్ ఉంది అని అప్పట్లో మీడియా వార్తలు వ్రాసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అయితే అలాంటి గాలి వార్తలను జూనియర్ ఎప్పుడు పట్టించుకోలేదని అంటూ జూనియర్ సంస్కారం పై సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇప్పుడు సమీరా రెడ్డి అనుకోకుండా జూనియర్ కు ఇగో లేదు అంటూ చేసిన కామెంట్స్ పై చరణ్ అభిమానులు వేరే అర్ధాలను వెతుకుతున్నారు. సమీరా రెడ్డి దృష్టిలో జూనియర్ కు ఇగోలేదు ఎవరితో అయినా సద్దుకుపోతాడు అన్న మాటలను బట్టి జూనియర్ తో నటించే మిగతా హీరోలు ముఖ్యంగా చరణ్ కు ఇగో ఉందా అంటూ సమీరా రెడ్డి కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: