తెలుగు సీనియర్ హీరోల్లో నాగార్జున ఒకరు. ఆయన దాదాపుగా వంద వరకూ సినిమాలకు చేరువ అయిన నటుడు. రొమాంటిక్ హీరోగా నాగ్ తన ప్రతిభను చాటుకుంటూనే అన్ని రకాల పాత్రలను వేశారు. నాగ్ లేటేస్ట్ గా మళ్ళీ వరస సినిమాలతో బిజీ అయ్యాడు.


కాగా నాగార్జున బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా త్వరలో బుల్లితెర ముందుకు   వస్తున్నాడు. బిగ్ బాస్ రెండు సీజన్లూ బాగానే రన్ అయింది. మరీ ముఖ్యంగా ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేసినపుడు వచ్చిన రేటింగే వేరు. ఇక రెండో సీజన్ కి నాని హోస్ట్ గా చేశాడు. ఇదిలా ఉండగా నాగార్జున మూడవ సీజన్ కి వస్తున్నారు.


ఇదిలా ఉండగా బిగ్ బాస్ కాన్సెప్ట్ తనకు నచ్చలేదని నాగ్ గతంలో హాట్ కామెంట్స్ చేసాడు. అందరినీ తీసుకువచ్చి ఓ గదిలో బంధించి వారు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే అది ఎంటర్టైమెంట్ ఏంటని నాగ్ అప్పట్లో కామెంట్స్ చేశాడు. మరి అటువంటి నాగ్ బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా వస్తున్నాడంటే అదంతా డబ్బు మహిమ అంటున్నారు.


ఇదిలా ఉండగా బిగ్ బాస్ 3 సీజన్ కి హోస్ట్ చేయడానికి గానూ నాగ్ 12 లక్షల రూపాయలు ప్రతీ వారం తీసుకుంటాడుట. ఓ విధంగా  ఇది చాలా పెద్ద మొత్తం. మీలో ఎవడు కోటీశ్వరుడు అన్న ప్రొగ్రాం కి హోస్ట్ చేస్తున్నపుడు నాగ్ ఏడు లక్షలు తీసుకునేవాడు. ఇపుడు దానికి దాదాపుగా రెట్టింపు మొత్తం అన్నమాట. మొత్తానికి నచ్చలేదంటూనే నాగ్ బాగానే పడిపోయాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: