ఊహలు గుసగుసలాడే అంటూ టాలీవుడ్ పై ఊహలు పెంచుకుంటూ అడుగుపెట్టిన రాశిఖన్నా మ‌రీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎద‌గ‌క‌పోయినా మిడిల్ రేంజ్ సినిమాలు, మిడిల్ రేంజ్ హీరోల‌తో ఆడిపాడే విష‌యంలో మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. కొంత కాలంగా మంచి ఛాన్సులు లేక‌పోయిన ఈ అమ్మ‌డు స‌రైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది.


స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ప‌క్క‌న జై ల‌వ‌కుశ లాంటి సినిమా చేసిన రాశీఖ‌న్నా తాజాగా త‌న హాట్ హాట్ అందాల ఫొటోల‌ను వ‌రుస‌పెట్టి సోష‌ల్ మీడియాలో వ‌దులుతోంది. తాజాగా వైట్ డ్రెస్సులు వేసుకుని హాట్ పొజుల‌తో మ‌త్తెక్కించిన ఈ అమ్మ‌డు... రెండు రోజుల క్రితం రెడ్ షార్ట్ డ్రెస్సుల‌తో మాంచి కిక్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో వెంకిమామ చేస్తున్నది.  అటు తమిళంలో విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. 


ఈ క్ర‌మంలోనే మ‌రిన్ని ఛాన్సుల కోసం తాను ఎంత‌కైనా రెడీ అన్న‌ట్టుగా త‌న ఫొటోల ప‌రంప‌ర‌లో  రీసెంట్ గా బీచ్ ఒడ్డున ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎండలు తగ్గిపోయి వాతావరణం చల్లబడింది. కానీ, రాశి తన గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో వేడిని పెంచింది అన్న‌ట్టుగా ఆ ఫొటోలు ఉన్నాయి. బీచ్ ఒడ్డున హాట్ డ్రెస్సుతో ఆమె ఇచ్చే స్మైల్‌కే కుర్రకారు ప‌డిపోతారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: