'ఇస్మార్ట్ శంకర్' సినిమా. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి, ఛార్మి కలిసి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తుండగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేస్తున్నారు. జులై 18 వ తేదీ నుంచి పూరి స్టైల్‌లో ఈ ముగ్గురి రొమాన్స్ చూడనున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.          

 

పోస్టర్స్‌లో బోల్డ్ నెస్, రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌ని బట్టి చూస్తే ఈ సినిమాలో పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఊరమాస్ డైలాగులతో, స్పైసీ సన్నివేశాలతో కట్ చేయబడిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్‌‌లో కంటెంట్‌తో పాటు డైలాగ్స్ కొన్ని బోల్డ్‌గా ఉండటంతో సెన్సార్ పరంగా చిక్కులు ఏమైనా వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది జనాల్లో.

 

అయితే గోవాలో సముద్రపు బ్యాక్ డ్రాప్‌లో తీసిన పాటల్లో తప్పితే ఇంకెక్కడా బోల్డ్ సన్నివేశాలు గానీ, వివాదాస్పద డైలాగ్స్ గానీ ఉండవని అంటున్నారు యూనిట్ సభ్యులు. ట్రైలర్ చూసి అలా ఫీల్ కావొద్దని కంటెంట్ వేరుగా ఉంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. నిజానికి సెన్సార్ బోర్డు నుంచి ఇస్మార్ట్ శంకర్ కు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు.. ఒకవేళ సెన్సార్ బోర్డు ఒకటి రెండు సీన్స్ కట్ చేసినా సినిమాను ఆపే ఛాన్సులు లేవు.

 

ఇస్మార్ట్ శంకర్ గురించి రిలీజ్‌పై అనుమానాలు అవసరం లేదని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పూరి స్టైల్ టేకింగ్‌లో మొదటిసారి పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు హీరో రామ్. విలక్షణ పాత్ర కావడంతో ఈ సినిమా తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందని ధీమాగా ఉన్నాడు రామ్. పూరి జగన్నాథ్ గత సినిమాల రిసల్ట్ పట్టించుకోకుండా, ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: