రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు పవన్ ఫుల్ గడ్డంతో కనిపించేవాడు. అయితే రాజకీయాల్లో కొంచెం విరామం వచ్చిన తరువాత ఇప్పుడు మోడరన్ లుక్ లోకి మారిపోయారు. మొన్నటిదాకా గడ్డం, తెల్ల చొక్కాతో అచ్చమైన పొలిటిషన్ లా కనిపించిన పవన్ కళ్యాణ్.. తాజాగా జీన్స్, టీ షర్ట్ ధరించి మోడ్రెన్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ లుక్ లో పవన్‌ని చూసి ఆశ్చర్యపోయిన పబ్లిక్.. మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాడా? ఏంటి? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో తానాలో జరిగే మహాసభల కోసం వెళుతున్న పవన్.. ఎయిర్ పోర్ట్‌లో ఇలా కనిపించారు. 


ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహా సభలు జులై 4 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్‌ డీసీ లో జరగనున్నాయి. ఈ సభలకు పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు సినీ ప్రమఖులు హాజరై సందడి చేయబోతున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి, తమన్, పూజా హెగ్డే తానా సభల్లో మెరవనున్నారు.  


తానా మహా సభలకు ముఖ్య అతిధిగా హాజరవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ సభా ప్రాంగణంలో ఇచ్చే స్పీచ్ ఎలా ఉంటుందనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ స్పీచ్ పై అక్కడి తెలుగు ప్రజల ఆసక్తి ఎలా ఉంటుంది? పవన్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అనేది జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: