నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఓ బేబీ సినిమా ఈ రోజే రిలీజైంది. 70 ఏళ్ళ ముసలావిడ 25 ఏళ్ళ వయసులోకి మారితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో రుపుదిద్దుకున్న చిత్రం ఓ బేబీ. ఈ సినిమా కొరియన్ కు చెందిన " మిస్ గ్రానీ " సినిమాకు రీమేక్. నాగ శౌర్య, అడవి శేష్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. 
 
ఈ సినిమాకు అన్ని చోట్ల నుండి మంచి స్పందన వినిపిస్తుంది. యూ టర్న్, సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న సమంతకు ఓ బేబీ సినిమాతో మరో విజయం తన ఖాతాలో పడనుంది. సినిమాలో కామెడీ , ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినా క్లైమాక్స్ మాత్రం సినిమాలో అద్భుతంగా ఉంది. 
 
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగులో సమంత మాత్రం వరుస విజయాలు అందుకుంటుంది. సమంత తప్ప ఈ రోల్ లో ఎవరూ నటించలేరు అనే విధంగా ఓ బేబీ క్యారక్టర్లో జీవించింది. యూ టర్న్, ఓ బేబీ సినిమాలు హిట్టవ్వడంతో భవిష్యత్తులో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సమంత నటించే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: