తెలుగు టీవీ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్గా నిలిచింది. జూనియర్ ఎన్టీయార్ ఈ షోను హోస్ట్ చేయడంతో ఈ షోకు చెప్పలేనంత క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 2 ను నాని హోస్ట్ చేసాడు. సీజన్ 1 రేంజ్లో కాకపోయినా సీజన్ 2 కూడా బాగానే హిట్టయ్యింది. కొన్ని విషయాల్లో సీజన్ 2 ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ ఆ ట్రోల్సే సీజన్ 2 హిట్టవ్వడానికి కారణమయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ మా ఛానెల్లో జులై 21 నుండి ప్రారంభం కాబోతుంది. సీజన్ 3 కు హోస్ట్గా నాగార్జున వ్యవహరించబోతున్నాడు. 
 
కానీ ఈ షోకు సెలబ్రిటీల ఎంపికలో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. నిజానికి సీజన్ 1 , సీజన్ 2లో పాల్గొన్న చాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత తమ కెరీర్ మారిపోతుందని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 2 విన్నర్లైన శివ బాలాజీ, కౌశల్ కు, మిగతా సెలబ్రిటీలకు చెప్పుకునే రేంజ్లో అవకాశాలైతే రాలేదు. కౌశల్ గురించి కొంతకాలం చర్చలు జరిగినా ప్రస్తుతం కౌశల్ గురించి పట్టించుకునే వారు ఎవరూ లేరు. 
 
హరితేజ, కత్తి మహేశ్ కెరీర్లకు మాత్రమే బిగ్ బాస్ షో అంతో ఇంతో ఉపయోగపడింది. దీనికి తోడు 100 రోజులు ఫోన్లకు, ఫ్యామీలీలకు, బయటి ప్రపంచానికి దూరంగా ఉండటం సెలబ్రిటీలకు సాధారణ విషయం కాదు. బిగ్ బాస్ షో నిర్వాహకులు మాత్రం ఫామ్లో ఉన్న సెలబ్రిటీల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సారి పాల్గొనే సెలబ్రిటీలు ఎవరో తెలియాలంటే మాత్రం జులై 21 దాకా ఎదురు చూడక తప్పదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: