టాలీవుడ్ పవర్ స్టార్ గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో ఫుల్ గా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇక అయన ఇటీవల జనసేన పార్టీ తరపున పోటీ చేసిన రెండు నియోజకవర్గాల నుండి ఘోర పరాజయం పొందడం, అలానే పార్టీకి కూడా కేవలం ఒకే ఒక్క సీట్ మాత్రమే రావడంతో, ఇక రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే పనుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రస్తుతం జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసే పనిలో అయన ఉన్నారు. అయితే ఇటీవల పవన్ ను అమెరికాలో జరిగే తానా సభలకు ప్రత్యేక అతిథిగా రావలసిందిగా ఆహ్వానించడం జరిగింది. 


ఇక వారి ఆహ్వానం మేరకు నిన్న అమెరికా చేరుకున్న పవర్ స్టార్ కు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించిందట. అయితే అక్కడ కూడా ఆయనకు అవే పాత ప్రశ్నలు ఎదురయ్యాయట. మీరు మళ్ళి సినిమాల్లోకి రావాలి, మా అభిమానుల కోసం కనీసం ఒక్క సినిమా అయినా చేయాలి అంటూ పలువురు ఫ్యాన్స్ ఆయనను కోరడం జరిగిందట. నిజానికి ఈ విషయమై ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ, కళ్యాణ్ గారు ఇకపై సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికినట్లే, అయితే ఏదైనా తనకు నచ్చిన ప్రత్యేక పాత్ర వస్తే భవిష్యత్తులో చేసే అవకాశం లేకపోలేదు అని చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అది పట్టుకుని మళ్ళి ఫ్యాన్స్ కోసం సినిమాలు పవన్ చేస్తారా అంటే, 


ఆయన సన్నిహితులు మాత్రం ఖచ్చితంగా లేదనే చెప్తున్నారు. అయన అమెరికాలో ల్యాండైన సమయంలో తన ఫ్యాన్స్ కు కూడా మరొక్కసారి పవన్ అదే మాట చెప్పడం జరిగిందట. ఇకపై తన రాబోయే జీవితం అంతాకూడా కేవలం ప్రజా సేవకే అంకితం అని, అది తప్ప తనకు వేరే ఆలోచన లేదని పవన్ అక్కడివారి వద్ద ఖరాఖండిగా తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే పవన్ సినిమాలు చేయకపోయినా ప్రజా సేవలో ఉన్నా చాలు, ఆ విధంగా అయనను చూస్తూ బ్రతికేస్తాం అని అంటున్న ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. మరి పవన్ రాబోయే రోజుల్లో ఎంతవరకు సినిమాలు చేస్తారో అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: