అల్లు అర్జున్ టాలీవుడ్ లో బెస్ట్ హీరోల్లో ఒకరు.  గత కొంతకాలంగా ఈ హీరో విజయంలో వెనకబడిపోయారు.  ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో సినిమా చేస్తున్నారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.  ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి.  


అల్లు అర్జున్ ఏం చేసినా దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది.  అందరిలోనూ ఓ స్పెషల్ ఉంటుంది. రీసెంట్ గా ఈ హీరో తనకోసం సొంతంగా ఓ వ్యానిటి కారును కొనుగోలు చేశారు.  అధునాతన హంగులు అన్ని అందులో ఉన్నాయి.  ఒకప్పుడువ్యానిటి కార్ అంటే కేవలం కాసేపు రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు.  


ఇప్పుడు అందులో అన్ని హంగులు ఉన్నాయి.  దానిని రోడ్డుపై తిరిగే ఫైవ్ స్టార్ హోటల్ లా భావించవచ్చు.  స్నానం చేయడానికి దగ్గరి నుంచి అన్ని రకాల వసతులు అందులో ఉంటాయి.  ప్రస్తుతం ఈ వ్యానిటి వ్యాన్ అల్లు అర్జున్ 19 వ సినిమా షూటింగ్ లో ఉన్నది.  


ఈ వ్యాన్ ను చూడటానికి అనేక మంది షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కు వస్తున్నారట.  దీనికోసం అల్లు అర్జున్ 7 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని సమాచారం.  ఏదైనా సరే తన దగ్గర ఉన్నది స్పెషల్ గా ఉండాలని అల్లు అర్జున్ అనుకోవడం సహజమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: