సమంత సినిమాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నది.  ఆమె చేసున్న సినిమాలు వరసగా హిట్ అవుతున్నాయి.  ఈ ఏడాది సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలు హిట్ కొట్టాయి.  ఇప్పుడు ఓ బేబీ సినిమా కూడా ఇదే వరసలోకి వచ్చి చేరింది.  ఈ ఏడాది వరసగా మూడు హిట్స్ కొట్టింది సమంత.  


పెళ్లి తరువాత ఇలా వరసగా హిట్స్ కొడుతున్న హీరోయిన్ బహుశా సమంత ఒక్కరే అయ్యి ఉంటారు.  ఎంచుకునే సినిమాలు కూడా అదే విధంగా ఉన్నాయి.  పెళ్లి తరువాత ఆమె ఎక్కువుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నది.  


పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం దొరకడం లేదు.  స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే సమంత మనసులో కొంతమంది దర్శకులతో సినిమాలు చేయాలని ఉంటుంది కదా.  అలాంటి వాళ్లలో ఇద్దరు ఉన్నారు.  ఆ ఇద్దరిలో ఒకరు మణిరత్నం కాగా, రెండో వ్యక్తి శేఖర్ కమ్ముల.  మణిరత్నంతో సినిమా సినిమా చేయాలని అందరికి ఉంటుంది. 


కానీ, నటీనటులు అడిగితె ఆయన అవకాశం ఇవ్వరు.  కథకు తగ్గట్టుగా ఆయన నటీనటులను ఎంపిక చేసుకుంటారు.  అందుకే ఆయన సినిమా కోసం అందరు ఎదురు చూస్తుంటారు. మరో దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సమంత చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందట.  ఆ కోరిక ఇప్పటి వరకు తీరలేదట.  


శేఖర్ కమ్ముల నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు.  ఇందులో సాయి పల్లవి హీరోయిన్.  ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  అయితే, శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని సమంత అనుకుందట.  ఈ విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. కనీసం నాగచైతన్య వద్ద ఈ విషయాన్ని చెప్పినా ఈపాటికి చైతు సినిమాలో ఫిక్స్ అయ్యేది కదా.  పోనీలో మరో సినిమాతో ఆ కోరిక తీరుతుందేమో చూద్దాం.    


మరింత సమాచారం తెలుసుకోండి: