తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అక్కినేని సమంత గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి.  పెళ్లైన తర్వాత ఆమె నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్ అవ్వమే కాదు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి.  తాజాగా నందిని దర్శకత్వంలో సమంత నటించిన ‘ఓ బేబీ’ ఈరోజు రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన రాగా..ఆడియన్స్ మాత్రం సమంత నటనకు ఫిదా అవుతున్నారు.

 

  తాజాగా సమంత నటనపై బాలీవుడ్ హీరోయిన్ చెల్లెలు ప్రశంసల జల్లు కురిపిస్తుంది.  బాలీవుడ్ క్విన్ కంగనా రౌనత్ చెల్లెలు రంగోలి ‘ఓ బేబీ’ మూవీలో సమంత నటనపై ట్వీట్ చేసి.. సమంతపై ప్రశంసల జల్లు కురిపించింది.‘ఓ బేబీ’ అద్భుతమైన విజయాన్ని అందుకుందని, సమంత అసలు సిసలైన స్త్రీవాది అని రంగోలి పేర్కొంది.

 

సామ్ జీవితం ఓ విజయవంతమైన కథ అని, ఓ గొప్ప కుటుంబానికి కోడలు అయినా ఆమె ఎంత సింప్లీ సిటిగా ఉందో చూస్తుంటే తెలుస్తుందని అన్నారు.  సమంత వంటి దేవతల్ని తాము ప్రశంసిస్తామని, కంగన బృందం నుంచి ఆల్ ది బెస్ట్ చెబుతూ రంగోలి ట్వీట్ చేసింది. దీనిపై సమంత వెంటనే స్పందించి తనపై ఎంతో ప్రేమ కురిపించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రంగోలీకి సమాధానమిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: