యాంకర్ గా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, గుర్తిపుని సంపాదించుకున్న రఘు కుంచే ఇప్పుడు తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతుంన్న సినిమా 'పలాస 1978'. ఈ సినిమాలో రఘు కుంచే విలన్ గా కనిపించబోతున్నారు. అది కూడా సాదా సీదా విలన్ పాత్ర కాదు. నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించే విలన్ పాత్రనిన్ లేటెస్ట్ న్యూస్.

అంతేకాదు 'పలాస 1978' సినిమాకు రఘు కుంచే మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుండటం మరో విశేషం. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్ కు, రఘు విలన్ పాత్రకు సూటవుతారని ఫిక్స్ చేశారు. ఈ క్యారెక్టర్ లో నాలుగు డిఫరెంట్ ఏజ్ లు చూపించే పాత్రను రఘు చేస్తున్నారు. ఈ సినిమాలో 30-40-50-70 ఏజ్ లలో రఘు కనపించబోతున్నారని సమాచారం.

రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న 'పలాస 1978'  సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. మరి రఘు కుంచే యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. అలానే మ్యూజిక్ డైరెక్టర్‌గాను మంచి సినిమాలకు సంగీతమందించి సక్సస్ అయ్యారు. ఇప్పుడు యాక్టర్‌గా ఎలాంటి పేరును సంపాదించుకుంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: