అల్లు అర్జున్ ఏం చేసినా గ్రాండ్ గానే ఉంటుంది. సినిమా, కేరెక్టర్, మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, స్టైల్.. అన్నీ లావిష్ గా ఉంటాయి. అందుకే ఫ్యాన్స్ ఆయన్ని స్టైలిష్ స్టార్ అంటారు. తనకంటూ ఓన్ స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు బన్నీ. డ్యాన్స్ లో, ఫైట్స్ లో తనదైన ముద్ర వేసి తెలుగుతో పాటు కర్ణాటక, మళయాళంలో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. మళయాళంలో అయితే మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు అక్కడి అభిమానులు.

 

ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ఓ అటెన్షన్ క్రియేట్ చేశాడు. షూటింగ్ గ్యాప్ లో రెస్ట్ తీసుకోవడానికి తన కోసం ఓ కేర్ వాన్ ను కొనుగోలు చేశాడు. ఈ కేర్ వాన్ ను ముంబయిలో స్పెషల్ గా ఓ డిజైనర్ చేత డిజైన్ చేయించినట్టు, ఖరీదు 7 కోట్లు అని సమాచారం. ఇంటీరియర్ తో సహా అన్నీ చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఉంచాడు బన్నీ “జీవితంలో అన్నీ ఉన్నతంగా ఉండేలా చూసుకుంటాను. ప్రేక్షకులు నామీద అపారమైన ప్రేమను చూపారు. అందుకే ఇలాంటి ఖరీదైనవి కొనగలుగుతున్నాను. వారు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు.” అని తన ట్విట్టర్ వాల్ లో రాసుకున్నాడు. ఇదిగో “ఫాల్కన్” అని కూడా రాసుకున్నాడు. ఫాల్కన్ అంటే ఓ డేగ జాతి పక్షి పేరు. ఐదు రోజుల పాటు అలుపు లేకుండా ఎన్ని వేల మైళ్లైనా ప్రయాణించే శక్తి దీని సొంతం.


ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్ కి వేసుకొచ్చిన గీవెంచీ టీషర్ట్ ఖరీదు 65వేలు. అప్పట్లో ఈ విషయం ట్రెండ్ అయింది. టీషర్ట్ కే అంత పెట్టినోడు.. షూటింగుల్లో రెస్ట్ తీసుకునే విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడు. ఇప్పుడదే జరిగింది. ఎందుకంటే సౌత్ లోనే ఏ స్టార్ హీరో కూడా ఇంత ఖరీదైన కేర్ వాన్ ఉపయోగించట్లేదని సమాచారం. తన టేస్ట్ కు తగ్గట్టు తన వస్తువులను సమకూర్చుకునే బన్నీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: