మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్  అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్, దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నారు. 

అయితే అయనతో ఒక సినిమా చేయాలని చాలా కాలం క్రితమే అనుకున్నట్లు ఇటీవల 'అ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మొన్న ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు. నిజానికి అందరిలానే తనకు కూడా మెగాస్టార్ అంటే ఎనలేని అభిమానమని, అయితే తన మొదటి సినిమా 'అ' తెరకెక్కకముందే మెగాస్టార్ కు ఒక కథ చెప్పే అవకాశం రావడం జరిగిందని, ఒక నిర్మాత ప్రోత్సాహంతో వెళ్ళి ఆయనకు కథ వినిపించానని అన్నారు. ఇక తన కథ విన్న మెగాస్టార్ గారు, ఇప్పటివరకు తనకు అద్భుతమైన కథలు వినిపించిన మొదటి ఐదుగురిలో నువ్వు ఒకడివి అని ఆయన అభినందించారని అన్నారు. 

అయితే కొన్ని అనుకోని కారణాల వలన ఆ సినిమా చేయడం కుదరలేదని, ఒకవేళ అన్ని అనుకుని ఆ సినిమా కనుక తాను తీసినట్లైతే, ఈపాటికి మెగాస్టార్ ని అయన ఫ్యాన్స్ అందరూ ఒక మెస్మరైజింగ్ రోల్ లో చూసేవారని, అంతేకాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయన కటౌట్ కి పాలాభిషేకాలు జరిగేవని ఆయన అన్నారు. భవిష్యత్తులో అవకాశం వస్తే మెగాస్టార్ తో ఎప్పటికీ నిలిచిపోయేలా ఒక గొప్ప సినిమా మాత్రం తప్పకుండా తీస్తానని ప్రశాంత్ అంటున్నారు. మరి అయన కల రాబోయే రోజుల్లో ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: