నిన్న ప్రారంభం అయిన తానా మహాసభల కోసం అమెరికా వెళ్ళిన పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ ‘జనసేన’ ఘోర పరాజయం చెందిన తరువాత పవన్ హాజరౌతున్న ఒక పెద్ద ఈవెంట్ కావడంతో పవన్ కు స్వాగతం పలకడానికి అమెరికా తానా సంస్థకు చెందిన కీలక సభ్యులు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళి పవన్ ను సాదరంగా ఆహ్వానించారు.

అయితే పవన్ కళ్యాణ్ లుక్ మార్చిన విషయం అమెరికాలోని తెలుగువారిలో కొందరికి మాత్రమే తెలిసిన నేపధ్యంలో నీట్ గా మళ్ళీ హీరోలా తయారై వచ్చిన పవన్ ను చూసి తానా సంస్థ సభ్యులు కూడ ఆశ్చర్యపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ ఎప్పుడూ వేసుకునే జీన్ టి. షర్ట్ లుక్ తో ఎయిర్ పోర్ట్ లో అందరికీ దర్శనం ఇచ్చాడు. పవన్ లుక్ ను చూసిన చాలామంది తానా సంస్థ సభ్యులు ఆనందపడటమే కాకుండా పవన్ త్వరలో తిరిగి సినిమాలలోకి రాబోతున్నాడు అన్న సంకేతాలు ఈ లుక్ ఇస్తోంది అని కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు పవన్ తానా వేదిక నుండి ఇవ్వబోతున్న ఉపన్యాసం పై కూడ తానా సభ్యులలో ఆసక్తి పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ప్రభావం చూపించిన మనీ పవర్ క్యాస్ట్ పవర్ అంశాలను దృష్టిలో పెట్టుకుని లక్షల కోట్లు లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారం లేదు అన్న విషయాన్ని పవన్ తన సహజసిద్ధ శైలిలో తానా సభ్యులకు వివరంగా వివరించబోతున్నట్లు టాక్. 

ఈ సమావేశాలకు పవన్ కళ్యాణ్ తో పాటు కీరవాణి తమన్ పూజ హెగ్డే కమలనీ ముఖర్జీ లాంటి సెలెబ్రెటీలు చాలామంది అతిధులుగా రావడంతో తానా మహాసభలలో సందడి వాతావరణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 80 రకాల వంటలతో ఈ మహాసభలలో పాల్గొంటున్న ప్రతినిధులకు పెడుతున్న ఫుడ్ ఐటమ్స్ ఈ తానా మహాసభలలో హైలెట్..  


మరింత సమాచారం తెలుసుకోండి: