సమంత అక్కినేని కథనాయకగా నందిని రెడ్డి తెరకెక్కిన సినిమా ఓ బేబీ. ఈ సినిమా భారీ అంచనాలతో ఈరోజు విడుదలయ్యుంది. అనుకున్న విదంగానే  సినిమా సూపర్ హిట్ అయ్యింది. అక్కినేని ఇంట కోడలైన వేళా విశేషమో ఏంటో సమంత నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యి అందరిని ఆకట్టుకుంటోంది. 2 గంట‌ల 40 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. 


కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో 70 ఏళ్ళ వృధురాలుగా  లక్ష్మి గారు పాత్రకు ప్రాణం పోస్తే, 24 ఏళ్ళ పడుచుపిల్లగా సమంత అదరకొట్టేసారు. దీంతో సమంత అభిమానులు సమంతను పొగుడుతూ ఓ రేంజ్ లో ట్విట్స్ పెడుతున్నారు. ఇదే తరహాలో సెలబ్రెటీలు కూడా సమంతను పొగుడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ బేబీ సినిమా చుసిన 'ఛార్మి' కూడా సంచలన కామెంట్ చేశారు. 


ఛార్మి ట్విట్ చేస్తూ '' ఏ టైంలో పుట్టావు అమ్మ సమంత అక్కినేని, నీ కష్టపడే తత్వానికి, నీ నిర్ణయాలు ఇంకా నీ జాతకంకి నమస్కారం. సమంత రాక్స్, ఓ బేబీ రాక్స్, చాలా ఆనందంగా ఉంది నందిని రెడ్డి గారు, శుభాకాంక్షలు ఓ బేబీ టీం అని పోస్ట్ చేశారు'' ఈ ట్విట్ కి స్పందించిన సమంత 'రోప్ల్ , యువర్ ది క్యుటేస్ట్.. థాంక్యూ చార్మీ.. హ్యూగ్స్ అండ్ కిస్సెస్'' అంటూ రిప్లై ఇచ్చింది సమంత. అయితే ఓ బేబీ సినిమా ఓహో అనిపిస్తోంది. ఛార్మి నిర్మించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా కూడా జులై 18న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రామ్ కథనాయకుడిగా నటించగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: