సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమ ఈరోజు ప్రేక్షకుల్ ముందుకు రానున్నది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వతో కలసి నందిని రెడ్డి, సమంత ఓ ఫన్నీ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.


ఈ నేపథ్యంలో గంగవ్వ.... సమంతను, నందిని రెడ్డి ని తన ఫన్నీ ప్రశ్నలతో అలరించింది. ఇందులో ప్రశ్న.... 'మీరు నాగచైతన్యకు ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు' అందుకు సమంత సమాధానంగా.... 'చాలా ఇచ్చాను. ఎంత ఇచ్చానో నేను మీ చెవిలో చెబుతాను' అని నవ్వేసింది. 


సోషల్ మీడియా లో వైరల్ మరీనా మరో ప్రశ్న ఏంటంటే, ట్రైలర్ లో సమంత డైలాగ్ చెప్పినట్టు, "మీరు సినిమాల చెప్పినట్టు నీకు నచ్చిన పోరగాడు మగాడిలా కాపురం చెయ్యాలి కదా, మరి మీ అయన అలానే చేస్తాడా" అని డైరెక్ట్ గ అడిగేయ్యడం తో అటు నందిని రెడ్డి కి, ఇటు సమంత కి మాటలు లేవు. సమంత సిగ్గు తో తలా దించుకొని నవ్వింది ఈ ప్రశ్నకి. ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అయ్యింది యూట్యూబ్ మరియు సోషల్ మీడియా లో. 

సూటిపోటి ప్రశ్నలే కాకుండా సమంత చేత రోటీలు చేయించడం, కూరగాయలు తరిగించుదాం కూడా చేసింది గంగవ్వ. సమంత కి అలవాటు లేని పనులు అవ్వడం తో గంగవ్వ పంచులకి సమంత కి సమాధానం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: