బిగ్ బాస్ సీజన్ -1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది . హోస్ట్ గా జూనియర్ అదరగొట్టాడు . తనదైన మేనరికం తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు . దీనితో  మా ఛానెల్ టీఆర్పీ రేటింగ్ ఆకాశానికి దూసుకువెళ్లింది . కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ -2 హోస్ట్ మారిపోయాడు . ఈసారి బాగ్ బాస్ -2 హోస్ట్ గా నాని ఎంటర్ అయ్యాడు . నాని వ్యాఖ్యాతగా సక్సెస్ అయిన ఎందుకో షో మాత్రం తొలుత ఆశించిన స్థాయి లో విజయం సాధించలేదు . తరువాత నాని కూడా ఫర్వాలేదన్నారు ప్రేక్షకులు .


ఇక సీజన్ -3 హోస్ట్ గా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వ్యవహరించనున్నాడు . ఈ విషయాన్ని ఇప్పటికే మా ఛానెల్ అధికారికంగా ప్రకటించింది . అయితే ఈ షో లో పాల్గొనేవారు ఎవరన్నది ఇంతవరకు మా ఛానెల్ ఫైనల్ చేయలేకపోతోంది . పలువురు బుల్లితెర యాంకర్లు , సెలబ్రెటీల పేర్లు వినిపిస్తున్నా , ఈ షో లో ఎవరు పాల్గొననురన్నది అధికారికంగా ప్రకటించేందుకు మా ఛానెల్ సంస్థ ధైర్యం చేయడం లేదన్న టాక్ విన్పిస్తోంది .


బిగ్ బాస్ షో లో పాల్గొనడం గొప్ప విషయమని, ఈ షో లో పాల్గొంటే సినీ  అవకాశాలు వెల్లువెత్తుతాయని  తొలి రెండు సీజన్లలో పాల్గొన్న వారు  ఆశించారు . కానీ  బిగ్ బాస్ -1  సీజన్ లో పాల్గొన్న సెలబ్రెటీలకు  బిగ్ బాస్ షో వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరింది లేదు . బిగ్ బాస్ -1 విజేతగా నిల్చిన శివ బాలాజీ కి ఆ తరువాత సినిమా అవకాశాలన్న మాటే లేకుండా పోయింది. ఇకపోతే బిగ్ బాస్ -2 లోను పాల్గొన్నవారిది అదే పరిస్థితి .దాంతో  ఇప్పుడు సీజన్ -3 లో పాల్గొనడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతోంది . హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తుండడం తో ఆయన పై గౌరవం తో కొంతమంది బుల్లితెర యాంకర్లు మాత్రం  ఓకే చెప్పినట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: