తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి హిందీ లో అదే విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే అదే కథతో అదే స్క్రీన్‌ప్లే తో తమిళంలో కూడా ఈసినిమాను విక్రమ్ కొడుకుని హీరోగా పెట్టి డైరెక్టర్ బాల సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ సరిగా సాగలేదని, అవుట్‌పుట్‌తో సంతృప్తి చెందని టీమ్ దాన్ని చెత్త బుట్టలో పడేసి.. మళ్లీ కొత్తగా సినిమా తీయాలని సంకల్పించారు. అర్జున్ రెడ్డి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన గిరీశయ్యతో మళ్లీ ‘ఆదిత్య వర్మ’ పేరుతో కొత్తగా సినిమా మొదలుపెట్టారు. 


ఈసినిమా ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయింది. రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ టీజర్ కి అదే స్పందన వచ్చింది. అదే నెగెటివిటీ కంటిన్యూ అయింది. ప్రేక్షకులు ఈ టీజర్ ని పూర్తిగా స్కిప్ చేసేసారు. నిజానికి ఈచిత్రాన్ని ఈనెలలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ఈమూవీని రిలీజ్ చేసేందుకు సాహసం చేయడంలేదు. ఈసారి టీజర్ రిలీజ్ తర్వాత కనిపించిన నెగెటివిటీ చూశాక ధ్రువ్‌ను పెట్టి ఈ సినిమా తీయడమే తప్పన్న విషయం స్పష్టమైంది. డైరెక్టర్ దగ్గర నుండి విక్రమ్ వరకు ఈ సినిమాను ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు.


ధృవ్ తొలి చిత్రం అయిన ‘ఆదిత్య వర్మ’ రిలీజ్ చేస్తే అతనికి జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువని.. ఇలాంటి సినిమాతో కెరీర్ మొదలైతే అతడిపై జనాల్లో ఓ నెగటివ్ ముద్ర పడుతుందని విక్రమ్ స్నేహితులు అండ్ విక్రమ్ భావిస్తున్నాడట. అందుకే ఈసినిమాను పక్కన పెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చయిందో అది అంత విక్రమ్ ఇచ్చేసి సినిమాను పర్మనెంట్‌గా ల్యాబ్‌కే పరిమితం చేసేయాలని విక్రమ్ యోచిస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: