ప్రభాస్ ‘సాహో’ వచ్చేనెల ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి కౌంట్ డౌన్ ప్రారభం అయిన పరిస్థితులలో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న విడుదల అయిన ‘సాహో’ లోని తొలిపాట టీజర్‌ కు ప్రభాస్ అబిమానుల నుండి మిశ్రమ స్పందన లబిస్తోంది. ‘సైకో సయ్యాన్‌’ అంటూ సాగే ఈపాట ప్రభాస్ అభిమానులను నిరాశపరచింది అని వార్తలు వస్తున్నాయి.  

ఈసాంగ్ టీజర్ లో ప్రభాస్ కంటే శ్రద్ధా కపూర్ ని ఎక్కువగా ఫోకస్ చేయడంతో పాటు శ్రద్దా కపూర్ తన గ్లామర్ తో డాన్సులతో శ్రద్దా ఇరగ దీసింది. ప్రభాస్‌ హ్యాండ్సమ్‌ గా కనిపించినా ఎనర్జీ లేదు డాన్సు స్టెప్పులు కూడ ఏమీ లేవు అంటూ ప్రభాస్ అభిమానులే కామెంట్స్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఆ టీజర్ కు సంబంధించి చివరిలో చూపించిన ఆ బైక్ షాట్ ఇంతకు ముందు చూసినదే కదా అంటూ ప్రభాస్ అభిమానులు నిట్టూర్పులు విడుస్తున్నట్లు తెలుస్తోంది.   దీనికితోడు దేశవ్యాప్తంగా టాప్ హీరోగా ప్రభాస్ ను ప్రమోట్ చెయ్యాలనుకున్నప్పుడు విడుదల చెయ్యాల్సిన టీజర్ ఇదికాదు అని ప్రభాస్ అభిమానులు కూడ నిరుత్సాహ పడుతున్నారు. 

ఇది చాలదు అన్నట్లుగా ఈపాటను హిందీలో షూట్ చేసి ఆ తరువాత తెలుగులో డబ్ చేశారు అని వార్తలు రావడం ప్రభాస్ అభిమానులను మరింత ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఈపాట గురించి అప్పుడే పూర్తిగా చెప్పలేమని కేవలం 30 సెకండ్స్ టీజర్ ను ఆధారంగా చేసుకుని ‘సాహో’ పాటల పై ఒక అభిప్రాయం రావడం మంచిది కాదు అంటూ మరికొందరు వాదిస్తున్నారు.  ఈసినిమాకు సంబంధించిన ఈపాటను పూర్తిగా  జులైన 8న విడుదల చేయనున్న పరిస్థుతులలో ఆరోజు మాత్రమే క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ‘సాహో’ విడుదలకు ఇక కేవలం 5 వారాలే మిగిలి ఉన్న ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి సరైన ప్లాన్స్ లేకుండా ఈమూవీ నిర్మాతలు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అనుసరిస్తున్న తీరు ప్రభాస్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు అని టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: