ఎనర్జిటిక్ హీరో రామ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీ `ఇస్మార్ట్ శంకర్`. నిధి అగర్వాల్-నభ నటేష్ నాయికలు. పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈనెల 18న సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ క్రమంలోనే పూరి టీమ్ ప్రచారంలో అంతకంతకు వేడి పెంచుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. రామ్ నైజాం యాసతో మాస్ అవతారంలో అదరగొట్టేశాడు.

 

ఇస్మార్ట్ టీజర్ మాస్ లోకి దూసుకెళ్లింది. దాంతో పాటే ఈ సినిమాపై వివాదాలు ముసురుకోవడం సంచలనమైంది. టీజర్ చూశాక ఇది కాపీ కథతో తెరకెక్కింది! అంటూ పలువురు క్రిటిక్స్ విమర్శించిన సంగతి తెలిసిందే. 2016 లో రిలీజైన హాలీవుడ్ చిత్రం క్రిమినల్ కథతో ఈ సినిమా కథకు పోలికలు ఉన్నాయని పలువురు క్రిటిక్స్ విమర్శలు గుప్పించారు.

 

`క్రిమినల్` కథాంశం ప్రకారం.. ఓ హ్యాకర్ ని సీఐఏ ఏజెంట్ వెంటాడుతాడు. కానీ ఆ ఏజెంట్ హత్యకు గురవుతాడు. ఆ క్రమంలోనే అతడి బ్రెయిన్ లోని మెమరీస్ ని చిప్ ద్వారా కాజేసి సదరు క్రిమినల్ బ్రెయిన్ లోకి పంపిస్తారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమా కథ తరహాలోనే ఇస్మార్ట్ శంకర్ కథ ఉందనేది ఆరోపణ. ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్ కి ఓ చిప్ అమర్చి ఉండడం టీజర్ లో కనిపించింది. దీంతో పూరి టీమ్ ఆ కథనే లిఫ్ట్ చేశారా? అంటూ డిబేట్లు నడిచాయి.

 

అయితే అది గతం. వర్తమానంలో ఈ సినిమా కాపీ కథే.. అది నాదే!! అంటూ ఓ యువ రైటర్ తాజాగా రచయితల సంఘంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దర్శకుల సంఘం పెద్దలు.. రచయితల సంఘ సభ్యులు కలిసి పూరీ తో ఈ కథ విషయమై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ కథ ను సదరు రచయిత హీరో గారి పెదనాన్న స్రవంతి రవికిషోర్ కు గతంలో చెప్పారట. ఆ కథనే పూరీ లిఫ్ట్ చేశారని.. ఇస్మార్ట్ శంకర్ కథ యథాతథంగా కనిపిస్తోందని సదరు రచయిత ఆరోపణలో పేర్కొన్నారని తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: