తెలుగులో హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలు ఫలించాయి.  అనుకున్నట్టుగానే సినిమా హిట్ కొట్టింది.  సినిమా హిట్టవ్వడమే కాదు.. ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు సాధిస్తోంది.  


ఇప్పటికే ఈ మూవీ రూ. 214 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  బాలీవుడ్ లో అందరు హీరోలు సోలోగా వంద కోట్లు వసూలు చేస్తుంటే.. షాహిద్ కు మాత్రం ఆ అవకాశం దొరకలేదు.  కబీర్ సింగ్ సినిమాతో ఆ లోటు పూడింది.  ఏకంగా 214 కోట్లు వసూలు చేసి రికార్డు సాధించింది.  


లాంగ్ రన్ లో ఈ మూవీ తప్పకుండా 300 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.  ఆగష్టు 15 వరకు పెద్ద సినిమాలు లేవు.  దీంతో కబీర్ సింగ్ కు ఎదురు లేకపోవచ్చు.  కియారా అద్వానీకి ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది.  ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అమ్మడు ముద్దులతో ముంచెత్తింది.  


అంతేకాదు, సందీప్ రెడ్డికి మరో అఫర్ ను తెచ్చిపెట్టింది ఈ మూవీ.  టి సిరీస్ సంస్థ సందీప్ తో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది.  సల్మాన్ లేదా మరో టాప్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అన్నట్టుగా కథను సిద్ధం చేసుకోమని చెప్పినట్టుగా సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: