ఈ మద్య కాలంలో టాలీవుడ్ లోకి ఎంతో మంది పరభాష హీరోయిన్లు వస్తున్నారు.  తమిల, మళియాళ, కన్నడ భాషల నుండి హీరోయిన్లు వస్తున్నారు.  ముఖ్యంగా మాలీవుడ్ హీరోయిన్ల తెలుగు లో మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.  అప్పుడప్పుడు కన్నడ హీరోయిన్లు వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు.  కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడనాట మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన తెలుగు లో నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’సినిమాతో నటించింది. 

ఇది ఆమెకు మొదటి సినిమా అయినా మంచి సక్సెస్ సాధించింది.  ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన ‘గీతా గోవిందం’ బ్లాక్ బస్టర్ అయ్యింది.   ఈ మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  దాంతో రష్మికకు మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. డీగ్లామరస్ పాత్ర, ట్రెడిషనల్ పాత్ర ఏదైనా న్యాచురల్  నటన కనబరచి దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలలో రష్మిక కంటే ఆమె పాత్ర ఎక్కువగా కనిపిస్తుంటుంది.  ఈ క్రేజ్ తోనే ఇప్పుడు స్టార్ హీరోలు మహేష్ బాబు, తమిళ నాట విజయ్ సరసన ఛాన్స్ దక్కించుకుంది.  


ఈ మద్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..వాస్తవానికి నేను నటనలో శిక్షణ తీసుకోలేదు..అప్పుడప్పుడు కాలేజ్ ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తుండేదాన్ని.. కానీ నటనవైపు అస్సలు వెళ్లేదాన్ని కాదు. అందరూ అంటుంటే ఒకసారి నటించే ప్రయత్నం చేసి ఘోరంగా విఫలం చెందాను..దాంతో నటనవైపే వెళ్లలేదు.  అలా నాకు అప్పట్లో నటన తెలియకపోవడమే ఇప్పుడు నాకు ప్లస్ అయిందేమో అని చెప్పుకొచ్చింది. 

నాకు దర్శకులు చెప్పిన పాత్రలో లీనమై పోతుంటాను.. సన్నివేశంలోని సందర్భం నిజంగా నాకే ఎదురైతే ఎలా స్పందిస్తానో ఊహించుకుంటూ అందుకు తగ్గట్టుగా నటించాను, అదే నా ప్లస్ అవుతూ ఆడియన్స్ కి ఎంతో నేచురల్ గా కనిపిస్తుంది. ఇదీ నా పాత్రల్లో కనిపించే సహజత్వం వెనుక అసలు రహస్యం అదే అని చెప్పింది రష్మిక.


మరింత సమాచారం తెలుసుకోండి: