తానా మహాసభల కోసం అమెరికాలోని వాషింగ్టన్ వెళ్ళిన పవన్ తానా వేదిక నుండి కొన్ని  ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మొదటిసారి తన ఓటమి పై మనసు విప్పి మాట్లాడిన పవన్ తన ఓటమి గురించి మరిచిపోవడానికి కేవలం తనకు 15 నిమిషాలు మాత్రమే పట్టిన విషయాన్ని వివరించాడు. 

తన ఓటమికి ఎన్నో కారణాలు వివరంగా చెప్పవచ్చని అయితే పిరికి వాళ్ళు అసమర్ధులు మాత్రమే తమ ఓటమి గురించి కారణాలు వెతుక్కుంటారని అయితే ఎప్పటికైనా గెలిచే మనస్తత్వం ఉన్న వాళ్ళు రాబోయే రోజుల గురించి ఆలోచిస్తారని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను స్కామ్ లు చేసి వాటిని కవర్ చేసుకోవడానికి రాజకీయాలలోకి రాలేదని చెపుతూ తాను నమ్మిన మార్గంలో ఓటమి వచ్చినా తనకు సంతోషమే అంటూ కామెంట్స్ చేసాడు. 

సినిమా నటుడుగా తాను ‘ఖుషీ’ తర్వాత మరో హిట్ కోసం ‘గబ్బర్ సింగ్’ వరకు వెయిట్ చేసిన విషయాన్ని వివరిస్తూ తాను రాజకీయాలలో గెలుపు కోసం ఎంత కాలమైనా వేచి ఉండగలను అన్న సంకేతాలు ఇచ్చాడు. తాను ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు తనను చూడటానికి వేల సంఖ్యలో జనం వచ్చినప్పుడు వారంతా తనకు ఓటు వేస్తారని చాలామంది తన దగ్గరకు వచ్చారని అయితే తన సభలకు వచ్చిన వారంతా తనకు ఓట్లు వేయరు అన్న విషయం తనకు పూర్తిగా ఎప్పుడో తెలుసు అంటూ పవన్ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 

ఇదే సందర్భంలో పవన్ తన అభిమానులకు ముఖ్యంగా జనసైనికులకు చురకలు అంటించాడు. తాను పాల్గొనే ప్రతి ఎన్నికల సభల్లో పవన్ సి.ఎమ్. అంటూ హడావిడి చేసిన అభిమానులు కొద్దిగా ఓపికతో ఓట్లు వేయించి ఉంటే తనకు ఓటమి వచ్చేది కాదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా తాను తానా మహాసభలకు ఎందుకు వచ్చాను అంటూ వస్తున్న ఊహాగానాలను విపరీతంగా చదివే తన అభిమానులు తమ ఎనర్జీని ఆవిషయం పై వృథా చేసుకోకుండా ఏదైనా ఒక మంచిపని చేస్తే బాగుండేది కదా అంటూ పవన్ చేసిన కామెంట్స్ ఖచ్చితంగా పవన్ వీరాభిమానులను ఆలోచింపచేసి తీరుతాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: