న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మనం సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న విక్రమ్ కె కుమార్ ఆ తర్వాత హలో సినిమాతో చేతులు కాల్చుకున్నాడు. నాని-విక్రమ్ కాంబినేషన్ ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేదే కానీ ట్రేడ్ వర్గాల దృష్టిలో మాత్రం ఇది రిస్కీ ప్రాజెక్టే. ఎందుకంటే విక్రమ్ కుమార్ ఈమధ్య దర్శకత్వం వహించిన  సినిమాలేవీ లాభాలు తీసుకురాలేదు.

 

మరోవైపు నాని సినిమాలు కూడా ఈమధ్య లాభాల బాట పట్టడం లేదు.  'కృష్ణార్జున యుద్ధం'.. 'దేవదాస్' ఫెయిల్యూర్లుగా తేలగా.. విమర్శకుల చేత ప్రశంసలు దక్కించుకున్న  'జెర్సీ' బొటాబొటీగా గట్టెక్కింది. దీంతో నాని 'గ్యాంగ్ లీడర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడట.టాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ఏంటంటే నాని 'గ్యాంగ్ లీడర్' షూటింగ్ కు కొద్దిరోజులు ఆపాడట. విక్రమ్ కుమార్ బ్రిలియంట్ ఫిలిం మేకరే కానీ బడ్జెట్ అదుపులో పెట్టడంలో మాత్రం ఫెయిల్ అవుతుంటాడని మొదటి నుంచి కంప్లయింట్ ఉంది.

 

ఈ సారి కూడా 'గ్యాంగ్ లీడర్' విషయంలో  క్వాలిటీ పేరుతో షెడ్యూల్ కంటే నెమ్మదిగా షూట్ చేస్తుండడంతో బడ్జెట్ లిమిట్ దాటిపోతోందట. ఇలా కొనసాగితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచే పరిస్థితి ఎదురువుతుందట.  దీంతో నాని రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడట.

 

షూటింగ్ లో సమయంలో టైమ్ వేస్ట్ కాకుండా ఉండేందుకు కొద్దిరోజులు షూటింగ్ ఆపి విక్రమ్ ను పక్కాగా ప్లానింగ్ చేసుకోమని చెప్పాడట.మరి ఇది జస్ట్ రూమరేనా.. లేదా నిజంగా నాని విక్రమ్ కు చెప్పాడా అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఏదైతేనేం.. ఇది రూమర్ కాకుండా నిజం అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ఇలా చేయడమే మంచిదని అభిప్రాయ పడుతున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ గా  నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: