నందిని రెడ్డి డైరక్షన్ లో సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓ బేబీ. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. సమంతతో పాటుగా సినిమాలో చాలా మంచి కాస్ట్ అండ్ క్రూ నటించారు. అందులో ముఖ్యంగా బేబీ అలియాస్ సావిత్రి పాత్రలో సీనియర్ నటి లక్ష్మి గారు నటించారు.


శుక్రవారం రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సక్సెస్ ను కేవలం ఓ బేబీ యూనిట్ మాత్రమే కాదు మిగతా సెలబ్రిటీస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ బేబీ సినిమా చూసిన హీరోయిన్ కం ప్రొడ్యూసర్ ఛార్మి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. ఏ టైంలో పుట్టావమ్మా సమంత.. నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్స్, నీ జాతకానికి నామస్కారం అంటూ నందైని రెడ్డి అండ్ టీం కు కంగ్రాట్స్ చెప్పింది.


ఒక హీరోయిన్ గా ఛార్మి మంచి పాత్రలే చేసింది కాని సమంత చేస్తున్న పాత్రలని చూసి ఛార్మి చాలా ఎక్సైట్ అయ్యింది. ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది కాబోలు అందుకే సినిమా చూసిన వెంటనే సమంతపై తన ప్రేమను ట్వీట్ రూపంలో చూపించింది ఛార్మి. ఛార్మి పెట్టిన మెసేజ్ కు సమంత కూడా క్రేజీ రెస్పాన్స్ ఇచ్చింది.


యు ఆర్ ద క్యూటెస్ట్.. థ్యాంక్ యూ ఛార్మీ.. హుగ్స్ అండ్ కిస్సెస్ అంటూ సమంత ఛార్మికి రెస్పాన్స్ ఇచ్చింది. ఒక హీరోయిన్ నటన గురించి తాను కూడా హీరోయిన్ అయ్యుండి ఇలా పొగడటం ఛార్మీకే చెందింది. నందిని రెడ్డి ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది. పెళ్లి తర్వాత సమంత వరుస విజయాలు అందుకుంటుంది. మజిలీ హిట్ తర్వాత ఓ బేబీ హిట్ టాక్ సమంతకు మరింత జోష్ ఇచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: