బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ షోని తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోకి వచ్చేలా చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ 3వ సీజన్ కు రెడీ అవుతుంది. ఆల్రెడీ తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 ఈమధ్యనే మొదలైంది. కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో అప్పుడే ఆసక్తి పెంచేసింది.


బిగ్ బాస్ సీజన్ 3 తమిళ్ లో ప్రస్తుతం హాట్ కంటెస్టంట్ గా ఓ అమ్మాయి పేరు వినపడుతుంది. శ్రీలంక నుండి వచ్చిన లోస్లియా బిగ్ బాస్ సీజన్ 3లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కోలీవుడ్ యూత్ ఆడియెన్స్ లోస్లియా మాయలో పడినట్టు తెలుస్తుంది. ఆమె లుక్స్, మాటలు, హౌజ్ లో ఆమె ప్రవర్తన ఇవన్ని ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి.  


అందుకే షో మొదలైందో లేదో లోస్లియా కోసం కొన్ని గ్రూప్స్ కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా లోస్లియా ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ ఆర్మీ అంటూ అతని ఫాలోవర్స్ చేసిన హంగామా తెలిసిందే. అదే సీన్ తమిళ బిగ్ బాస్ లో కూడా రిపీట్ అవుతుంది.


బిగ్ బాస్ తమిళం సీజన్ 2లో కూడా ఓవియా అంటూ ఓ అమ్మడు హంగామా చేసింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఓవియా క్రేజ్ పెరిగింది. సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. మరి చూస్తుంటే లోస్లియాకు ఇలాంటి క్రేజీ రెస్పాన్స్ వచ్చేలా ఉంది. ఇక బయటకు రావడమే ఆలస్యం ఆమె కోసం ఆఫర్లు క్యూ కట్టేలా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: