సెలబ్రెటీలంటే సొసైటీలో ఉండే క్రేజే వేరు.. అందులోనూ సినీరంగానికి చెందిన వారంటే.. ఈ క్రేజ్ ఇంకాస్త ఎక్కువ.. అందులోనూ అందాల హీరోయిన్లయితే.. ఆ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే.


ఓ హీరో, హీరోయిన్ ఏదైనా కార్యక్రమానికి వస్తున్నారంటే చాలు.. జనం గుమిగూడిపోతారు. వారిని దగ్గర నుంచి చూడాలని.. వీలైతే ఓ సెల్పీ తీసుకోవాలని తెగ ఆరాటపడతారు. ఒక్క సెల్ఫీ దొరికిందంటే చాలు జన్మ ధన్యమైనట్టు భావిస్తారు.


అయితే హీరోయిన్లు బయటకు రావాలంటే ఇబ్బందే.. ఏదైనా షాపు ప్రారంభోత్సవాలకు వచ్చినా జనం తొక్కిసలాటలు జరుగుతాయి. కొందరు పోకిరీలు ఎక్కడపడితే అక్కడ చేతులు వేసేందుకు రెడీగా ఉంటారు. అందుకే ఈ జనాన్ని కంట్రోల్ చేసేందుకు బౌన్సర్లు వచ్చారు.


ఈ బౌన్సర్ల ఓవర్ యాక్షన్ చాలాసార్లు చూశాం. అయితే హీరోయిన్లకు మగ బౌన్సర్లతోనూ ఇబ్బందే.. అదుంకే ఇప్పుడు హీరోయిన్ల కోసం ఆడ బౌన్సర్లు కూడా రంగంలోకి దిగారు. ఇదిగో పై ఫోటోలో తమన్నాతో ఉన్న వారిద్దరూ బౌన్సర్లే.. ఈ ఏర్పాటు ఏదో బావుంది కదూ.


మరింత సమాచారం తెలుసుకోండి: