భద్ర సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు బొయపాటి శ్రీను. తులసి, సింహా సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ఎన్టీయార్తో తీసిన దమ్ము సినిమా ఫ్లాప్ అయినప్పటికీ లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయక హిట్ అయ్యాయి. కానీ అనూహ్యంగా రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అవ్వటమే కాకుండా సినిమాలోని కొన్ని సీన్లు బోయపాటి ఇమేజ్ ను డ్యామేజ్ చేసాయి. 
 
జనవరిలో విడుదలైన వినయ విధేయ రామ సినిమా తరువాత బోయపాటి శ్రీను సినిమా ఏంటో ఇంతవరకు తెలియట్లేదు. బాలయ్యతో సినిమా ఓకె అవుతుందని అందరూ భావించినా బాలకృష్ణ మాత్రం కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాడు. వినయ విధేయ రామ ఫ్లాప్ కావటంతో చిరంజీవితో బోయపాటి శ్రీను చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రస్తుతానికి లేనట్లే అని తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. 
 
నిజానికి బోయపాటి చెప్పిన కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ ఈ సినిమాకు సుమారు 60 కోట్లదాకా బడ్జెట్ అవసరమవుతుందనే అంచనా. 40 నుండి 50 కోట్ల మధ్యలో సినిమా తీయడానికి నిర్మాతలు సిధ్ధంగా ఉన్నారట. ఒకవేళ సరైన నిర్మాత దొరికితే మాత్రం ఈ ప్రాజెక్ట్ 2020 సంక్రాంతి తరువాత మొదలవుతుంది. లేకపోతే మాత్రం బోయపాటి శ్రీను మరో హీరో చాన్స్ ఇచ్చేదాకా వేచి చూడక తప్పదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: