తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన "సింధ్ బాద్ "చిత్రం కొన్ని కారణాల వల్ల ఇంకా విడుదల అవలేదు. జూన్ 28 వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కోర్టు ఈ సినిమా విడుదలని నిలిపివేసింది. బాహుబలి నిర్మాతలతో సింధ్ బాద్ నిర్మాతకు మధ్య జరిగిన వైరం కారణం అని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా అంజలి నటించింది. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో ఇంకా తెలియదు.

 

అయితే ఈ సినిమా విషయం అలా ఉంచితే, విజయ్ ఈ సంవత్సరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది 96 మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కుతున్న చిత్రం "సైరా". ఈ సినిమాలో విజయ్ సేతుపతిది కీలకమైన పాత్ర. సైరా సినిమాని మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇందులో విజయ్ సేతుపతి పాత్ర చాలా ఉపయోగపడుతుంది.

 

ఇప్పటివరకు విజయ్  హీరోగా, విలన్‌గా, ట్రాన్స్‌జెండర్‌గా రకరకాల పాత్రల్లో కనిపించారు.  ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న సినిమాలు కూడా అలానే ఉంటాయని అర్థం అవుతోంది. దానికి కారణం ఆ సినిమాల్లో సేతుపతి గెటప్సే. తాజాగా ‘కడైసి వివసాయి’ అనే సినిమాలో మానసికంగా ఆరోగ్యవంతంగా లేని పాత్రలో కనిపిస్తారట. ఈ సినిమాలో విజయ్ గెటప్ ని రివీల్ చేసారు.

 

మణికందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ పాత్ర చాలా కీలకం.  మానసికంగా పరిపక్వత లేని పాత్రలో విజయ్ సేతుపతి చాలా బాగా చేసాడని, త్వరలో ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని విడుదల చేయనున్నారని పేర్కొన్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ సినిమాలోని విజయ్ సేతుపతి పాత్ర గురించి తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: